కృష్ణా జిల్లా రమణక్కపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు అక్కిరెడ్డిగూడెనికి చెందిన రాజేశ్, గోపాలకృష్ణగా గుర్తించారు. వీరిని స్థానికులు నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ద్విచక్రవాహనం అదుపుతప్పడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని క్షతగాత్రులు వివరించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు ! - నూజివీడులో రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన రమణక్కపేట వద్ద చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా..వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు