ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు దిల్లీ నుంచి విజయవాడ రానున్న తెలుగు విద్యార్థులు - ap students lockdown on punjab

పంజాబ్​లో చదువుతున్న సూమరు 2 వందల మంది విద్యార్థులు దిల్లీ నుంచి విజయవాడకు రానున్నారని కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవిలత తెలిపారు. వారందరికి విజయవాడ రైల్వే స్టేషన్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవి లత
కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవి లత

By

Published : May 13, 2020, 3:51 PM IST

పంజాబ్​లో చదువుతున్న రాష్ట్రానికి చెందిన సూమారు 2వందల మంది విద్యార్థులు రేపు రాత్రికి విజయవాడకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా వారికి రైల్వేస్టేషన్​లోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ ఏర్పాట్లను కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవిలత రైల్వే పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలను తరలించే ఏర్పాట్లు చేశామని... తరలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుందని ఆమె తెలిపారు. నగరానికి చేరుకున్న ప్రతి ఒక్కరినీ క్వారంటైన్​కు తరలిస్తామన్నారు. పరీక్షల అనంతరం ఫలితాలను బట్టి వారిని ఇళ్లకు పంపిస్తామన్నారు. ఇప్పటికే రైల్వే స్టేషన్​లో తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details