విషాదం: చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి - కృష్ణా జిల్లాలో ఇద్దరు చిన్నారులు మృతి
14:00 April 30
చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి
కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో ప్రమాదవశాత్తు మంచినీటి చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మల్లేశ్వరం గ్రామానికి చెందిన గంగుమొలు వెంకటేశ్వర్లు కుమార్తె హర్షిత నాగేశ్వరి, అదే గ్రామానికి చెందిన గొర్ల సాయి కుమార్తె గొర్ల యోషిత... గ్రామంలో ఉన్న చెరువు పక్కనే ఆడుకోడానికి వెళ్లారు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ చెరువులో పడి చనిపోయారు. ఎంతసేపటికీ చిన్నారులు ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు గ్రామంలో వెతికారు. చెరువులో చిన్నారులు మృతదేహం తేలడాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అప్పటి వరకూ ఆడుతూ ఉన్న చిన్నారులు విగత జీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి:
విదేశాల్లోని భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు