కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పంట పొలాల్లో తెగిపడ్డ విద్యుత్ తగిలి కౌలు రైతు చలసాని కృష్ణమూర్తి, ఎలక్ట్రీషియన్ కోగంటి ప్రసాద్ మృతి చెందారు. కృష్ణమూర్తి పొలంలో మోటార్ బాగు చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గత కొంతకాలంగా ఇక్కడ తీగలను సరి చేయాలని విద్యుత్ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని.. వారి నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విషాదం.. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి - shock
కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో తెగిపడ్డ విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు.
విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి