కృష్ణాజిల్లా మోపిదేవి వార్పు వద్ద గురుకుల పాఠశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు.
మోపిదేవి వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - మోపిదేవి రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లా మోపిదేవి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
మోపిదేవి పంచాయతీ శివారు గంజివానిపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు కుమార్తె నాగలక్ష్మి (18), కుమారుడు యశ్వంత్ (12)లు మోపిదేవి వార్పు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సును తప్పించబోయి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు తగలడంతో నాగలక్ష్మి (18), కుమారుడు యశ్వంత్ (12) అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతణ్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:సరిహద్దు చెక్‌పోస్టు వద్ద భారీగా తెలంగాణ మద్యం పట్టివేత