కృష్ణా జిల్లా నందిగామ కాకతీయ రెస్టారెంట్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రెస్టారెంట్ వద్ద రహదారి పక్కన పార్క్ చేసిన ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టటంతో ఒకరు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీని మరో లారీ ఢీకొట్టటంతో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ కనకారావు ఎస్సై ఏసోబు సంఘటనా స్థలానికి చేరుకొని.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను నందిగామ మార్చురీకి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - accident at nandigama kakiteya restaurant
ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టంతో ఒకరు మృతి చెందగా.. ప్రమాదానికి కారణమైన లారీని మరో లారీ ఢీకొట్టంతో మరొకరు మృతి చెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లా నందిగామ వద్ద జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి