ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NAGARJUNA SAGAR: సాగర్​కు తగ్గుతున్న వరద.. 2 క్రస్టు గేట్లు ఎత్తి నీటి విడుదల - two crust gates opened due to flood flow decreased to nagarjuna sagar

నాగార్జున సాగర్​కు క్రమంగా వరద తగ్గుముఖం పడుతోంది. ప్రాజెక్టు 2 క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్​కు ఇన్​ఫ్లో 50 వేల 995 క్యూసెక్కులు కాగా.. అంతే మొత్తం ఔట్​ ఫ్లో కొనసాగుతోంది.

సాగర్​కు తగ్గుతున్న వరద.. 2 క్రస్టు గేట్లు ఎత్తి నీటి విడుదల
సాగర్​కు తగ్గుతున్న వరద.. 2 క్రస్టు గేట్లు ఎత్తి నీటి విడుదల

By

Published : Aug 12, 2021, 4:16 PM IST

ఎగువ నుంచి ప్రవాహం తగ్గిపోయిన కారణంగా.. తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్​ ప్రాజెక్టుకు స్పల్ప స్థాయిలో వరద చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. వచ్చిన వరదను 2 క్రస్టు గేట్లను ఎత్తి అధికారులు దిగువకు వదులుతున్నారు. సాగర్​ ఇన్​ఫ్లో 50 వేల 995 క్యూసెక్కులు కాగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.4 అడుగుల వద్ద కొనసాగుతోంది. సాగర్​ పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 310.25 టీఎంసీలకు చేరుకుంది.

అటు సూర్యాపేట జిల్లా పరిధిలోని పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన ఘటనతో 45 టీఎంసీల్లో 40 టీఎంసీల నీరు దిగువకు విడుదలైంది. మళ్లీ ఇప్పుడిప్పుడే జలాశయానికి నీరు చేరుతోంది. సాగర్​ నుంచి వస్తున్న నీటితో ప్రస్తుతం పులిచింతల సగానికి పైగా నిండింది. జలాశయానికి ఇన్​ఫ్లో 42 వేల 335 క్యూసెక్కులు కాగా.. ఔట్​ఫ్లో 13 వేల 400గా ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా 27.60 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ABOUT THE AUTHOR

...view details