కృష్ణాజిల్లా జిల్లా చల్లపల్లిలో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి ఖాజావలి వెల్లడించారు. వైరస్ సోకిన వారికి అన్ని సౌకర్యాలు ఉంటే... హోం ఐసొలేషన్లో ఉండొచ్చని తెలిపారు. ఒకవేళ శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బందిగా ఉంటే... ఆసుపత్రికి తీసుకువెళ్తామని చెప్పారు. ప్రతీ ఒక్కరు మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని.... అత్యవసరమైతే తప్పా బయటకి రావద్దని సూచించారు.
'వైరస్ సోకినా.. హోం ఐసోలేషన్లో ఉండొచ్చు' - చల్లపల్లిలో కరోనా పాజిటివ్ కేసులు వార్తలు
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది. కృష్ణా జిల్లా చల్లపల్లిలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. అన్ని సౌకర్యాలు ఉంటే హోం ఐసోలేషన్లో ఉండొచ్చని తెలిపారు.
!['వైరస్ సోకినా.. హోం ఐసోలేషన్లో ఉండొచ్చు' Two covid(corona) Positive Cases registered in Challapalli, Krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7843205-194-7843205-1593585014586.jpg)
చల్లపల్లిలో కేసుల నమోదుపై మచిలీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి ఖాజావలి స్పందన