ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్​లో నందకుమార్‌పై మరో రెండు కేసులు - నందకుమార్‌పై హైదరాబాద్‌లో మరో రెండు కేసులు

Cheating cases against Nanda Kumar: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై హైదరాబాద్‌లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. స్థలం కొనుగోలు విషయంలో తమను మోసం చేశాడని నందకుమార్‌పై ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నందకుమార్‌పై మరో రెండు కేసులు
నందకుమార్‌పై మరో రెండు కేసులు

By

Published : Nov 14, 2022, 3:03 PM IST

Cheating cases against Nanda Kumar: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడుగా ఉన్న నందకుమార్‌పై హైదరాబాద్‌లో మరో 2 కేసులు నమోదయ్యాయి. సయ్యద్ అయాజ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. 2021 జూన్‌లో తమ ప్రాంగణాన్ని నందకుమార్ వ్యాపారానికి వాడుకోమ్మన్నాడని... తన సోదరులతో కలిసి 3వేల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు అయాజ్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇందుకు రూ.12లక్షల అడ్వాన్స్, నెలకు రూ.2లక్షల అద్దె, లాభాల్లో 10శాతం వాటా ఇస్తున్నట్లు చెప్పారు. కాగా... నందకుమార్ తమకు లీజుకు ఇచ్చిన స్థలం దగ్గుబాటి సురేష్, వెంకటేశ్‌ నుంచి ఆయన లీజుకు తీసుకున్నాడని తెలిసిందని అయాజ్‌ ఫిర్యాదులో వివరించాడు. అక్రమంగా లీజుకు ఇచ్చినట్లు గుర్తించి.. తమ డబ్బు తిరిగి ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడినట్లు వివరించారు.

Two cases against Nanda Kumar : డెక్కన్ కిచెన్ సమీపంలో 700 చదరపు అడుగుల స్థలాన్ని లీజు వ్యవహారంలోనూ మరో వ్యక్తి మరో ఫిర్యాదుతో నందకుమార్‌పై రెండో కేసు నమోదైంది. హైదరాబాద్‌లో గ్యాడ్జెట్ స్టూడియో పేరుతో చరవాణి పరికరాల వ్యాపారం చేస్తున్న సందీప్.. నెలకు లక్షన్నర అద్దె, 12లక్షల అడ్వాన్స్‌తో నందకుమార్‌ వద్ద స్థలం లీజుకు తీసుకున్నారు. రూ.50లక్షలతో వ్యాపారం కోసం స్థలాన్ని అభివృద్ధి చేసుకోగా.. తీరా అది దగ్గుబాటి కుటుంబసభ్యులకు చెందిన స్థలంగా తెలిసిందని బాధితుడు వాపోయాడు. ఇద్దరి ఫిర్యాదుల మేరకు పలుసెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details