విజయవాడ గూడవల్లి సమీపంలో కృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు.. గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కానందున అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏలూరు వైపు నుంచి విజయవాడ వస్తున్న కృష్ణ ట్రావెల్స్ బస్సును అదేదారిలో విజయవాడ వెళ్తున్న గన్నవరం ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో వెనక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో పెద్ద శబ్దంతో రెండు బస్సులు కుదుపులకు గురయ్యాయి. ప్రయాణికులు భయబ్రాంతులకు గురై కేకలు వేస్తూ కిటికీలో నుంచి దూకారు. తెల్లవారుజాము కావడం, హైవేపై పెద్దగా ట్రాఫిక్ లేనందున పెద్ద ప్రమాదం తప్పింది. పటమట పోలీసులు అక్కడికి చేరుకుని బస్సులను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
రెండు బస్సులు ఢీ.. తప్పిన పెను ప్రమాదం - విజయవాడ
విజయవాడ గూడవల్లిలో పెను ప్రమాదం తప్పింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
రెండు బస్సులు ఢీ.. తప్పిన ప్రమాదం