కృష్ణాజిల్లా నందిగామ మండలం జోన్నలగడ్డ వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని తెలంగాణ ఖమ్మం జిల్లా మధిర ఆస్పత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీ ఫూటేజీలో రికార్డు అయ్యాయి. అతివేగమే ఈ దుర్ఘటనకు కారణమని ఫూటేజి ఆధారంగా స్పష్టమవుతోంది.
అతివేగంతో ఢీకొన్న ఆటోలు.. గాల్లో కలిసిన 2 ప్రాణాలు - undefined
అతి వేగం.. 2 నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఎదురుగా వస్తున్న ఆటోను గమనించకుండా.. వేగంగా దూసుకెళ్లిన మరో ఆటో డ్రైవరు నిర్లక్ష్యం.. ప్రమాదానికి కారణమైంది.
2 ఆటోలు ఢీ... ఇద్దరు మృతి