కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గురజాడలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. రూ. 26 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఒంటరిగా జీవిస్తున్న చల్లా రాజేశ్వరి అనే వృద్ధురాలు.. ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇల్లు, బీరువా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోని ఆభరణాలు కనిపించడం లేదంటూ.. ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఇంట్లో భారీ చోరీ.. రూ. 26 లక్షల నగలు మాయం - గురజాడలో వృద్ధురాలి ఇంట్లో 26 లక్షల నగలు మాయం
యజమానురాలు ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గురజాడలోని ఓ ఇంట్లో.. రూ. 26 లక్షల సొత్తును దొంగలు కాజేశారు. ఇల్లు, బీరువా తాళాలను పగులగొట్టి.. బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నారు. విజయవాడ సీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు.
వివరాలు సేకరిస్తున్న పోలీసులు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వయంగా విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దొంగలు ముందుగా రెక్కీ నిర్వహించి.. చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్యాయత్నం