గడ్డి వాముల్లో దాచారు... పోలీసులు పట్టుకున్నారు - కృష్ణా జిల్లాలో అక్రమ మద్యం రవాాణా
18:46 June 05
రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగినందున మద్యం అక్రమ రవాణా దారులు రెచ్చిపోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సరకు తరలిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా మంతెనలో రూ.25లక్షల రూపాయల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామంలో రూ.25 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గడ్డి వాముల్లో దాచిన 150 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి ఈ మద్యాన్ని అక్రమంగా తరలించారని పోలీసులు తెలిపారు. కాగా.. నిన్న గన్నవరంలో రూ.2లక్షల విలువైన 8 కేసుల అక్రమ మద్యం పట్టుబడగా... నిందితుడిని విచారించగా ఈ మద్యం బాగోతం వెలుగుచూసింది.
ఇదీచదవండి.