ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో వైకాపా నుంచి తెదేపాలో చేరిన 25 కుటుంబాలు - ex MLA Tangira sowmya latest news

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో వైకాపాకి నుంచి 25 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్యక్షతన తెదేపాలోకి చేరారు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రం అంతటా ఫ్యాక్షన్ పరిపాలన కొనసాగుతుందని సౌమ్య విమర్శించారు.

MLA Tangira
కృష్ణా జిల్లాలో 25 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలోకి.

By

Published : Jan 29, 2021, 2:04 PM IST

కృష్ణా జిల్లాలో వైకాపాకి నుంచి 25 కుటుంబాలు.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్యక్షతన తెదేపాలో చేరారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ పాలన సాగుతోందని సౌమ్య విమర్శించారు. ఈ ప్రభుత్వం సంక్షేమము, అభివృద్ధి మానేసి.. కేసులు పెట్టడం ఒక్కటే చేస్తోందని మండిపడ్డారు. 'న్యాయం గెలిచింది మనం సిద్ధంగా ఉండాలి. ఈ ఎలక్షన్లలో ప్రతి చోట తెదేపా జెండా ఎగురవేయాలి' అని శ్రేణులకు సూచించారు.

నిత్యావసరాలు మొత్తం కొండెక్కిపోయాయి.. పెట్రోల్ , కరెంటు బిల్లులు పెరిగిపోయాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఈ భారం మొత్తం ప్రజల మీద మోపుతోందని విమర్శించారు. అందరూ కలిసికట్టుగా పని చేసి స్థానిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని తెలిపారు.

ఇదీ చదవండీ..నాడు ఉత్తమ రైతు.. నేడు చేపలమ్ముతూ

ABOUT THE AUTHOR

...view details