కృష్ణా జిల్లాలోని మోపిదేవి, చల్లపల్లి మండలాల్లోని లంక భూముల్లో వేల ఎకరాల్లో పసుపు పండిస్తారు. ఆ పచ్చి పసుపును గుంటూరు జిల్లా వ్యాపారులు కృష్ణా జిల్లా వచ్చి కొనుగోలు చేసేవారు. ఈ సంవత్సరం లాక్డౌన్ ప్రభావంతో కృష్ణా, గుంటూరు జిల్లా సరిహద్దుల్లో పొలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మోపిదేవి వార్పు వద్ద వేబ్రిడ్జి కాటా కోసం వచ్చిన ట్రాక్టర్ని పోలీసులు తిప్పి పంపారు. అవనిగడ్డ ఎస్ఐ నుంచి లేఖ తీసుకువస్తేనే ట్రాక్టర్కు అనుమతి ఇస్తామని తెలిపారు. ఇలా అయితే పసుపు పంట కొనేవారు లేక నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు క్రింది స్థాయి వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
పసుపు రైతులను అడ్డుకున్న పోలీసులు - కరోనా లాక్డౌన్
రైతుల పంట ఉత్పత్తుల రవాణాను అడ్డుకోవద్దని ప్రభుత్వాలు చెబుతున్నా కొన్నిచోట్ల అలా జరగటం లేదు. పసుపు లోడుతో కృష్ణా జిల్లాలోని మోపిదేవి వార్పు వద్ద వేబ్రిడ్జి కాటా కోసం వచ్చిన ట్రాక్టర్ను పోలీసులు అడ్డుకుని వెనక్కు పంపారు.
turmeric farmers