ఒక కుటుంబంలో అర్హత కలిగి ఉన్న అందరికీ పింఛను ఇవ్వాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. వైకాపా ప్రభుత్వం కుటుంబానికి ఒకరికి మాత్రమే పెన్షన్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. దశలవారీగా పింఛన్ పెంచుతామని చెప్పి.. ఇప్పుడు సంవత్సరం గడిచినా రూ. 250 పెంచలేదన్నారు. సెప్టెంబర్ నుంచి అయినా పింఛన్ పెంచి ఇవ్వాలన్నారు. ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి విద్య, ఉద్యోగాలలో కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్ అమలు జీవోను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై 3 రోజులపాటు నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.
'ఒక కుటుంబంలో అర్హత కలిగిఉన్న అందరికీ పింఛన్ ఇవ్వాలి' - తులసిరెడ్డి
ఒక కుటుంబంలో అర్హత కలిగి ఉన్న అందరికీ పింఛను ఇవ్వాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి విద్య, ఉద్యోగాలలో కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్ అమలు జీవోను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు.
తులసిరెడ్డి, కాంగ్రెస్ నేత