ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాంగ్రెస్​తోనే ప్రత్యేక హోదా సాధ్యం: తులసిరెడ్డి - కాంగ్రెస్​తోనే ప్రత్యేక హోదా సాధ్యమన్న తులసిరెడ్డి

కాంగ్రెస్ పార్టీతోనే ఏపీకి ప్రత్యేక హోదా సాద్యమవుతుందని ఆ పార్టీ నేత తులసిరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ఉపఎన్నికల్లో కాంగ్రెస్​కు పట్టం కట్టాలని ఆయన ప్రజలను కోరారు.

కాంగ్రెస్​తోనే ప్రత్యేక హోదా సాధ్యం: తులసిరెడ్డి
కాంగ్రెస్​తోనే ప్రత్యేక హోదా సాధ్యం: తులసిరెడ్డి

By

Published : Mar 24, 2021, 3:55 PM IST

కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి స్పష్టం చేశారు. జగన్ పార్టీకి ఇచ్చే శక్తి, తేచ్చే శక్తి లేదని ఎద్దేవ చేశారు. తెదేపాకి ఇచ్చే స్తొమత, తెచ్చే స్తోమత లేదన్నా ఆయన... తిరుపతి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద 24,300 కోట్లకు గాను కేంద్రం 1400 కోట్లను మాత్రమే ఏపీకి ఇచ్చిందని ఆరోపించారు.

విభజన చట్టంలోని మిగిలిన అంశాలకు... దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలి ఇవ్వాల్సి ఉండగా కేవలం 8వేల కోట్లు మాత్రమే మంజూరు చేశారని తులసి రెడ్డి మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల సమస్యలను పరిష్కరించాల్సింది కేంద్రమే అయినప్పటికీ కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహించారు.

ABOUT THE AUTHOR

...view details