రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత పెరుగుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పునరుద్ధరించింది. రాష్ట్రంలో పునరుద్ధరించిన కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం చైర్మన్‌గా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కేఎస్ జవహర్‌రెడ్డిని నియమిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. గతంలో వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జవహర్‌రెడ్డి.. కొవిడ్ సమయంలో కీలకంగా వ్యవహరించారు. కొవిడ్ కమాండ్ కంట్రోల్ తో పాటు కరోనా నియంత్రణ, ఆస్పత్రుల నిర్వహణ తదితర అంశాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
తితిదే ఈవో జవహర్ రెడ్డికి.. కొవిడ్ కంట్రోల్ కేంద్రం బాధ్యతలు - today government orders to ttd Evo Jawahar Reddy latest update
తితిదే ఈవో కె.ఎస్. జవహర్ రెడ్డికి ప్రభుత్వం కొవిడ్ కంట్రోల్ కేంద్రం బాధ్యతలను అప్పగించింది. కొవిడ్ నివారణ, టీకాల పర్యవేక్షణకు కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పునరుద్ధరించింది. ఈమేరకు తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా అయన్ను కొవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 21 మంది అధికారులతో కూడిన బృందాన్ని వేర్వేరు అంశాల కోసం కొవిడ్ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానిస్తూ ప్రభుత్వం గతంలోనే ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో కొవిడ్ నిర్వహణ, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాల పర్యవేక్షణకు ఈ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇవీ చూడండి...:వ్యాక్సినేషన్‌పై సామాజిక మాధ్యమాల్లోని పుకార్లు నమ్మెుద్దు: ప్రభుత్వం