ఒంగోలు జాతి గిత్తలకు ప్రత్యేక గుర్తింపు ఉందని.., వీటి పరిరక్షణకు అంతా కృషి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విజయవాడ కానూరు సిద్ధార్థ కళాశాల మైదానంలో కృష్ణా జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన పోటీల్లో ఆయన పాల్గొన్నారు. గోపూజ నిర్వహించి.. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఒంగోలు జాతి గిత్తలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని వైవీ అన్నారు.
సుమారు 90 వరకు ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటాయి. ఈనెల 12 వరకు పోటీలు జరగనున్నాయి. నాలుగు పళ్ల విభాగంలో జరిగిన పోటీల్లో ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ఎడ్లు బహుమతులు గెలుచుకున్నాయి.