నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్బాస్-2లో తొలివారమే ఎలిమినేట్ అయిన సంజన గుర్తుందా. ఇప్పుడు ఆమె నూజివీడు అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
సంజన అన్నే
By
Published : Mar 29, 2019, 7:26 AM IST
ఎమ్మెల్యే అభ్యర్థిగా సంజన
కృష్ణా జిల్లా నూజివీడు అసెంబ్లీ స్థానానికి సినీనటి, బిగ్ బాస్ 2 ఫేం.. అన్నే సాయి సంజన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈమె స్వస్థలం జిల్లాలోని ఆగిరిపల్లి మండలం కృష్ణవరం. సామాన్యకుటుంబలో పుట్టిసినీ నటి స్థాయికి చేరిన ఈమె... జన జాగృతి పార్టీ తరఫున రాజకీయ రంగ ప్రవేశం చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ... ఆ పార్టీ అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేయనందున స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ స్థానానికి మొత్తం 11 మంది పోటీ పడుతున్నారు. ఒక్క అవకాశం ఇస్తే నూజివీడు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అంటున్నారు. ఆపిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. నేను రాజు నేనే మంత్రి చిత్రంలో సంజన ఓ పాత్ర పోషించారు.