ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇబ్రహీంపట్నంలో అగ్నిప్రమాదం-12 లారీలకు మంటలు - ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్‌ వద్ద అగ్నిప్రమాదం జరిగి 6 లారీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు 2 కోట్ల రూపాయలు నష్టం ఉంటుందని ప్రాథమిక అంచనా.

trucks-fire-accident-in-ap-krishna-district

By

Published : Jun 24, 2019, 9:10 AM IST

trucks-fire-accident-in-ap-krishna-district

విజయవాడ నగర శివారులోని ఇబ్రహీంపట్నం ట్రక్‌టెర్మినల్‌ వద్ద అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 12 లారీలు మంటల్లో చిక్కుకున్నాయి. ఆరు లారీలు పూర్తిగా కాలిపోయాయి. మరో ఆరు లారీలు పాక్షికంగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదానికి గురైన లారీలు సౌత్‌ ఇండియా లారీ ట్రాన్స్‌పోర్టుకు చెందినవిగా పోలీసులు పేర్కొన్నారు. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ వాహనాలకు సమీపంలోనే మరో 35 వాహనాల వరకు ఉన్నాయి. అయితే వాటికి మంటలు విస్తరించకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొన్నారు. సుమారు 2కోట్ల రూపాయల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శకటాలు- మంటలు విస్తరించకుండా చూశారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు అగ్నిప్రమాదానికి గురైన వాహనాలు పరిశీలించి- యజమానితో మాట్లాడారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు, అగ్నిమాపక అధికారులు దర్యాప్తు చేపట్టారు. గత కొన్నేళ్లుగా సౌత్‌ ఇండియా లారీ ట్రాన్స్‌పోర్టు యజమాని శ్యాంప్రసాద్‌ ఆర్ధికంగా నష్టాలు ఎదుర్కొంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి అగ్నిప్రమాదమేనే లేక మరే ఇతర అంశాలు కారణమై ఉంటాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు..

ABOUT THE AUTHOR

...view details