ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రేటర్ ఫలితాలు: స్వల్ప తేడాతో 17 స్థానాలు కోల్పోయిన తెరాస - telangana Ghmc elections news

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో తెరాస స్వల్ప ఓట్ల తేడాతో 17 స్థానాల్లో పరాజయంపాలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్... సీఎం కేసీఆర్​కు అందజేశారు. బీఎన్ రెడ్డి నగర్ స్థానాన్ని కేవలం 32 ఓట్లతో కోల్పోయింది.

trs
తెరాస

By

Published : Dec 5, 2020, 7:04 AM IST

Updated : Dec 5, 2020, 7:23 AM IST

తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస అతి తక్కువ ఓట్ల తేడాతో 17 స్థానాల్లో ఓటమిపాలైంది. ఈ వివరాలను తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్... పార్టీ అధినేత, సీఎం కేసీఆర్​ కు అందజేశారు. బీఎన్ రెడ్డి నగర్ స్థానాన్ని కేవలం 32 ఓట్లతో కోల్పోగా... మల్కాజిగిరి 178, అడిక్​మెట్ 227, హస్తినాపురం 279, వినాయకనగర్ 287, రాంగోపాల్ పేట 310 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

రామ్​నగర్ 528, మూసాపేట 538, రామాంతాపూర్ 655, వనస్థలిపురం 702, జూబ్లీహిల్స్ 779, మంగళ్​హాట్ 809, సైదాబాద్ 911, గచ్చిబౌలి 1135, అమీర్​పేట 1301, హబ్సిగూడ 1447,కవాడిగూడ 1477 ఓట్ల తేడాతో పరాజయంపాలైంది.

ఇదీ చూడండి:జీహెచ్​ఎంసీ ఫలితాలు: 47 స్థానాల్లో భాజపా గెలుపు

Last Updated : Dec 5, 2020, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details