వ్యవసాయాధికారుల అంచనా ప్రకారం జిల్లాలో 47,676 హెక్టార్లలో తెల్లజొన్న, 34 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. ప్రస్తుతం పంట చేతికందడంతో అమ్ముకోవాలని వారు తహతహలాడుతున్నారు. అయితే ప్రభుత్వం మొక్కజొన్న, తెల్లజొన్న పంటలకు క్వింటాలుకు రూ.1850 చొప్పున ధర నిర్ణయించడంతో చాలా మంది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విక్రయించడానికి సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి కొంతమంది రైతు భరోసా కేంద్రాల వద్ద వివరాలను కూడా నమోదు చేసుకున్నారు.
- చిరిగిన గోతాలే దిక్కు
వాస్తవానికి పంటను కేంద్రాల వద్దకు తీసుకువచ్చే రైతులకు గోతాలను అధికారులే అందించాలి. అయితే వారికి అందించే వాటిలో 30 శాతం చిరిగినవి ఉంటున్నాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇక కేంద్రాల వద్ద కొన్న పంటను గిడ్డంగులకు తరలించడానికి లారీలు సకాలంలో రావడం లేదు. దీంతో రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటను కేంద్రాల వద్దే నిల్వచేయాల్సి వస్తోంది. అకాల వర్షాల కారణంగా పంట తడిసిపోయే ప్రమాదం ఉంది. ఇది ఇలా ఉంటే పంటను గిడ్డంగులకు తరలించడానికి వచ్చిన లారీల డ్రైవర్లు కరోనా పేరుతో బస్తాకు రూ.4 చొప్పున రైతుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.
- నామమాత్రంగా కొనుగోళ్లు