విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన నేతలు.. కేక్ కట్ చేశారు. పార్టీ ఆవిర్భావం నాటి స్మృతులు, తెలుగుదేశం అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్ బాబు, తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, అధికార ప్రతినిధులు పట్టాభి, గొట్టిపాటి రామకృష్ణ, గంజి చిరంజీవి, కార్యనిర్వాహక కార్యదర్శులు బుచ్చి రాంప్రసాద్, చిట్టిబాబు, దారపనేని నరేంద్ర , వల్లురి కుమార్ స్వామి పాల్గొన్నారు.
విజయవాడలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. తెదేపా నేతల నివాళి - ఈరోజు విజయవాడలో ఎన్టీఆర్ జయంతి వార్తలు
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విజయవాడలో తెదేపా నేతలు.. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి.. పార్టీ ఆవిర్భావం నాటి స్మృతులు, తెలుగుదేశం అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.
![విజయవాడలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. తెదేపా నేతల నివాళి NTR Jayanti](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11928486-1007-11928486-1622188695144.jpg)
విజయవాడలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి