ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివేశన స్థలాలను ఖరారు చేయాలంటూ గిరిజన మహిళల నిరసన - నివేశన స్థలాలును ఖరారు చేయాలంటూ గిరిజన మహిళలు నిరసన

కృష్ణాజిల్లా నూజివీడు ప్రాంతంలో నివేశన స్థలాలను ఖరారు చేయాలంటూ గిరిజన మహిళలు నిరసన చేపట్టారు. నూజివీడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ముఖానికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలియజేశారు. నూజివీడు మండలం సిద్ధార్థ నగర్ గ్రామ సమీపంలోని కుక్కల తండాకు చెందిన సుమారు 70 కుటుంబాలు... 40 సంవత్సరాలుగా రోడ్లకు ఇరువైపులా చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. ఇందులో 30 కుటుంబాల వారికి 20 సంవత్సరాల క్రితం ఇళ్ల పట్టాలు మంజూరు చేయగా... మరో 40 కుటుంబాలకు పట్టాలు మంజూరు చేయలేదు. ఎన్నికల సమయంలో గిరిజనులు నివసించే ప్రాంతంలోనే నివేశన స్థలాలు ఖరారు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని బాధితులు తెలిపారు.

tribal women protest to finalize their land places at nijivedu
నివేశన స్థలాలును ఖరారు చేయాలంటూ గిరిజన మహిళలు నిరసన

By

Published : Mar 4, 2020, 1:45 PM IST

నివేశన స్థలాలను ఖరారు చేయాలంటూ గిరిజన మహిళల నిరసన

ఇదీ చదవండి:'తక్కువ ధరకే పొలం అన్నాడు... లక్షలు తీసుకుని మొహం చాటేశాడు'

ABOUT THE AUTHOR

...view details