ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరగదు' - గిరిజన రిజర్వేషన్లు తాజా వార్తలు

గిరిజన రిజర్వేషన్ల విషయంలో చట్టసవరణ చేసి వారికి మేలు కల్పించే విషయంలో ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని రాష్ట్ర గిరిజన సలహా మండలి తీర్మానం చేసింది. గిరిజన సంక్షేమశాఖ మంత్రి పుష్పశ్రీ వాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గిరిజన రిజర్వేషన్లపై చర్చించారు.

tribal advisory council meeting on tribal reservations
పుష్పశ్రీవాణి, మంత్రి

By

Published : Jun 18, 2020, 9:46 PM IST

గిరిజన రిజర్వేషన్ల విషయంలో చట్టసవరణ చేసి వారికి మేలు కల్పించే విషయంలో ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని రాష్ట్ర గిరిజన సలహా మండలి తీర్మానం చేసింది. జీవో నెంబరు 3ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన వ్యవహారంపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి పుష్పవాణి నేతృత్వంలో గిరిజన సలహా మండలి సమావేశమైంది. ఇందులో ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, పీడిక రాజన్న దొర, కళావతి, చెట్టి ఫాల్గుణ, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు, భాషలు, సాంప్రదాయాల నేపథ్యంలో అక్కడి గిరిజనులు ఉపాధ్యాయులుగా ఉంటేనే ఎక్కువ మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశముంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరగకూడదనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. గిరిపుత్రులకు న్యాయం చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతూ టీఏసీ తీర్మానించింది. ఐటీడీఏలలో వారి కోసం ప్రత్యేకంగా వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలకు రూ. 153 కోట్లు కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియచేశారు.

ABOUT THE AUTHOR

...view details