ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 10, 2020, 9:01 PM IST

ETV Bharat / state

విజయవాడలో కరోనా పరీక్షలు నిర్వహించే ట్రైఏజ్ కేంద్రం ప్రారంభం

కృష్ణా జిల్లా విజయవాడలో కరోనా పరీక్షలు నిర్వహించి..హోం క్వారంటైన్​కు పంపే ట్రైఏజ్ కేంద్రాన్ని కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. అధునాతన పరికరాలతో ఆక్సిజన్, ఈసీజీ, జ్వరం, పల్స్, బీపీని ఈ కేంద్రంలో పరీక్ష చేయవచ్చునని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున జిల్లాలో మూడు ప్రత్యేక కోవిడ్ క్వారంటైన్​ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రోజుకు 4 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెపుతున్న కలెక్టర్ ఇంతియాజ్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

triage center started at vijayawada
విజయవాడలో కరోనా పరీక్షలు నిర్వహించే ట్రైఏజ్ కేంద్రం ప్రారంభం

విజయవాడలో కరోనా పరీక్షలు నిర్వహించే ట్రైఏజ్ కేంద్రం ప్రారంభం

కృష్ణా జిల్లాలో కరోనా పెరుగుతున్నందున... అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. మాస్కులు ధరిస్తూ.. శానిటైజర్​ని వాడాలని సూచించారు. కరోనా వస్తే భయపడవద్దని ధైర్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details