ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్లాక్ ఫంగస్​ రోగిని చేర్చుకోని ఆస్పత్రులు... చివరికి..! - స్వర్ణభారత్ ట్రస్టీ రోగికి స్వర్ణభారత్ ట్రస్టీ చికిత్స

బ్లాక్ ఫంగస్​తో ఇబ్బంది పడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా వాసికి.. స్వర్ణభారత్ ట్రస్ట్ సహకారం అందించింది. బాధితుడు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా వైద్యం అందించడానికి నిరాకరణే ఎదురైన క్రమంలో స్వర్ణభారత్ ట్రస్ట్ చొరవతో.. కామినేని ఆస్పత్రి వైద్యులు స్పందించారు. అక్కడ చికిత్స తీసుకున్న బాధితుడు... సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యాడు.

స్వర్ణభారత్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్
స్వర్ణభారత్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్

By

Published : Jun 21, 2021, 7:00 AM IST

బ్లాక్ ఫంగస్​తో బాధపడుతున్న ఓ వ్యక్తికి చికిత్స అందడంలో స్వర్ణభారత్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ ప్రత్యేక చొరవ చూపారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కొల్లపల్లి అంజిబాబు మే నెలలో కొవిడ్ బారిన పడి కోలుకున్నారు. అనంతరం బ్లాక్ పంగస్ సోకటంతో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల్లో తిరిగినా వైద్యం అందకపోవటంతో అతడు నిరాశకు గురయ్యారు.

సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె.. స్వర్ణభారత్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్.. అతనికి విజయవాడ కామినేని ఆస్పత్రిలో చికిత్సకు ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అవసరమైన వైద్య సామగ్రి అందిచారు. ఆసుపత్రి యాజమాన్యం సహకారం, దీపా వెంకట్​ పర్యవేక్షణ, చొరవతో అంజిబాబు సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరారు. ఈ విషయమై అంజిబాబు కుటుంబీకులు దీపా వెంకట్, కామినేని హాస్పిటల్ యాజమాన్యం, కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details