ట్రాక్టర్ బోల్తాపడి... ఒకరు మృతి - one
కృష్ణా జిల్లా మైలవరంలో ట్రాక్టర్ బోల్తా పడింది. మైలవరం మండలం తోలుకోడు వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ తిరగబడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
కృష్ణా జిల్లా మైలవరంలో ట్రాక్టర్ బోల్తా పడింది. మైలవరం మండలం తోలుకోడు వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ తిరగబడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెడ్డిగుడెం ఓబులాపురం నుంచి తోలుకోడు మీదుగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న గెదెను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. మృతుడు ఓబులాపురానికి చెందిన తిరుమలరావుగా గుర్తించారు. మైలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.