కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పోలింగ్లో పాల్గొనే అధికారులు, అదనపు సిబ్బందికి నగర పంచాయతీ కమిషనర్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పోలింగ్ జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు శిక్షణా కార్యక్రమం - నందిగామ మున్సిపాలిటీ ఎన్నికల వార్తలు
నందిగామ నగర పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు నగర పంచాయతీ కమిషనర్ జయరామ్.. శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు శిక్షణా కార్యక్రమం