అగ్నిప్రమాదం సంభవించినప్పుడు.. ప్రాణ, ఆస్తినష్టం జరిగే అవకాశముంటుంది. ఒక్కోసారి ఫైర్ సిబ్బంది రావడానికి ఆలస్యం కావచ్చు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించే దిశగా కృష్ణా జిల్లా అగ్నిమాపక సిబ్బంది.. మూడ్రోజుల శిక్షణా తరగతులను ఏర్పాటు చేసింది.
అగ్నిప్రమాదాల నివారణకు పలువురికి శిక్షణ - training on fire accidents in krishna district
వేసవిలో తరచూ అగ్ని ప్రమాదాలు తలెత్తే అవకాశముండటంతో... అగ్నిమాపకశాఖ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆస్పత్రులు, దుకాణ సముదాయాల్లో... ప్రమాదం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలో తెలిపేందుకు మూడురోజుల పాటు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది.
కొవిడ్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదం దృష్ట్యా.. ఆస్పత్రి, దుకాణ సముదాయాల్లో పనిచేసే 110 మంది సిబ్బందికి శిక్షణనిచ్చారు. ఫైర్ ఫైటింగ్‌లో మెళకువలు నేర్పారు. అగ్నిమాపక శాఖ మంటలను ఏ విధంగా ఆర్పుతుందో డెమో ద్వారా సిబ్బందికి చూపారు. గుడిసెలు, భవనాలు, గ్యాస్ లీకేజీ ద్వారా జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. క్షతగాత్రులను ఏ విధంగా రక్షించాలి, ఎలా ఆస్పత్రికి తరలించాలో నేర్పించారు. మూడ్రోజుల పాటు జరిగిన శిక్షణా కార్యక్రమంలో చివరి రోజున కలెక్టర్ ఇంతియాజ్ హాజరయ్యారు. శిక్షణ తీసుకున్న సిబ్బందిని అభినందించారు. వేసవిలో అప్రమత్తంగా ఉండేందుకే శిక్షణనిచ్చిన్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండీ..యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా... పట్టించుకోని యంత్రాంగం