సామాజిక సమస్యలను వెలుగులోకి తెచ్చే విధంగా పాత్రికేయులకు శిక్షణ ఇవ్వాలని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనాథ్ రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించామని తెలిపారు. గ్రామీణ ప్రాంత విలేకరులతో పాటు సబ్ ఎడిటర్లకూ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 26న విశాఖలో శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు.
'సామాజిక సమస్యలు వెలుగులోకి తెచ్చే విధంగా శిక్షణ'
గ్రామీణ ప్రాంత విలేకరులు, సబ్ ఎడిటర్లకు ఈ నెల 26నుంచి శిక్షణ ఇస్తున్నామని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనాథ్ రెడ్డి అన్నారు. జర్నలిజం చదివే వారికి వృత్తి పట్ల అంకిత భావం పెంపొందించేలా యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుంటున్నామని తెలిపారు.
ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనాథ్ రెడ్డి
జర్నలిజం చదువుతున్న విద్యార్థులకు వృత్తి పట్ల అంకితభావం పెంపొందించేలా విశ్వవిద్యాలయాలతో అకాడమీ ఒప్పందం చేసుకుంటున్నామని వెల్లడించారు. సమగ్ర సమాచారంతో కూడిన ఓ వెబ్సైట్ను రూపొందిస్తున్నామని తెలిపారు. ఇందులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రాంతాల సమాచారం పొందుపరుస్తామని అన్నారు.
ఇదీచదవండి.