నిరుపేద మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ఉద్దేశంతో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని.. కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. స్థానిక సీఎంఆర్ ఫంక్షన్ హాలులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ.. మహిళా ప్రగతికి కృషి చేస్తున్న టాటా ట్రస్ట్ సేవలను కొనియాడారు. అదే విధంగా ఆ ప్రాంతంలో మహిళలకు తోడ్పాటు అందిస్తున్న మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కోయ సుధని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, టాటా ట్రస్ట్ సిబ్బంది, మదర్ థెరిస్సా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.