ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవస్థల్లోని లోపాలను సరిదిద్దుతూ ముందుకెళ్లాలి: సీఎం జగన్ - సీఎం జగన్ తాజా వార్తలు

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్​తో.. శిక్షణ ఐఏఎస్ అధికారులు భేటీ అయ్యారు. వారికి సీఎం జగన్ సలహాలు, సూచనలిచ్చారు. వారు తయారు చేసిన ప్రజంటేషన్లను అభినందించారు.

cm jagan
cm jagan

By

Published : Jun 29, 2020, 4:15 PM IST

ప్రతి వ్యవస్థలోనూ లోపాలుంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అలాంటివాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకుని ముందడుగులు వేస్తూ.. ఆ వ్యవస్థలను దృఢంగా తీర్చిద్దాల్సిన అవసరం ఉందని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన శిక్షణ ఐఏఎస్‌ అధికారులకు సూచించారు. ప్రభుత్వ శాఖలపై అవగాహన పెంచుకోవాలని.. అనుభవం సంపాదించాలని సూచించారు. ప్రభుత్వంలో ఉన్న అనుభవజ్ఞులైన అధికారుల మార్గ నిర్దేశం తీసుకోవాలన్నారు.

కోవిడ్‌ కారణంగా ముస్సోరీలో రెండో విడత శిక్షణ నెల రోజుల పాటు వాయిదా పడటంతో శిక్షణ ఐఏఎస్‌లకు శాఖలను కేటాయించారు. ఆయా శాఖల్లోని అంశాలు, విధానాలను తెలుసుకునేందుకు ట్రైనీ ఐఏఎస్​లు ఈ సమయాన్ని వినియోగించుకున్నారు. ఆ శాఖలపై ప్రజంటేషన్లు తయారు చేసిన వారు.. ఎంపిక చేసిన వాటిని సీఎం జగన్ ముందు ప్రదర్శించారు. శిక్షణ ఐఏఎస్‌లు కేటన్‌ గార్గ్, విదేఖరే, ప్రతిస్థలను సీఎం అభినందించారు. వారిని శాలువాలతో సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details