ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషాదం: పామర్రులో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం - Krishna District Latest news

కృష్ణా జిల్లాలో పామర్రులో విషాదం జరిగింది. వృద్ధ దంపతులు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. ఆస్తి తగదా విషయంలో తమపై దాడిచేశారని పోలీసులను ఆశ్రయిస్తే... ఇది తమ పరిధిలోని అంశం కాదు.. ఎమ్మార్వో దగ్గరికి వెళ్లమని చెప్పారు. మనస్థాపానికి గురైన ఆ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు.

పామర్రులో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
పామర్రులో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 3, 2021, 5:19 PM IST

పామర్రులో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

కృష్ణా జిల్లా పామర్రు పోలీస్​స్టేషన్ ఎదుట వృద్ధ దంపతులు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. పామర్రు గాంధీనగర్​కు చెందిన చిలంకుర్తి గోపాలకృష్ణ, దుర్గ దంపతులకు చెందిన స్థలం విషయంలో వివాదం నెలకొంది. ఈ స్థలానికి సంబంధించి తమ వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని దంపతులు చెబుతున్నారు. అయితే... సుమారు 25 మంది వచ్చి మంగళవారం కళ్లలో కారంకొట్టి దాడి చేశారని వృద్ధ దంపతులు వాపోయారు. తాము పోలీస్​స్టేషన్​కు వెళ్లి ఈ విషయం ఫిర్యాదు చేయగా ఈ కేసు సివిల్‌ అంశమని, తహసీల్దార్ దగ్గరకు వెళ్లాలని సూచించారు. మనస్థాపానికి గురైన ఆ దంపతులు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్యహత్యకు యత్నించారు.

పామర్రులో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details