కృష్ణలంక వారధిపై.. గంటలపాటు నిలిచిన ట్రాఫిక్ - krishna lanka
కృష్ణలంక వారధిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనపై రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తటంతో నగరవాసులు భారీగా తరలివచ్చారు. వాహనాలు నిలిపి వరద ప్రవాహం చూస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
![కృష్ణలంక వారధిపై.. గంటలపాటు నిలిచిన ట్రాఫిక్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4145211-thumbnail-3x2-trafic.jpg)
కృష్ణలంక వారధిపై నిలిచిన వాహన రాకపోకలు
కృష్ణలంక వారధిపై నిలిచిన వాహన రాకపోకలు
విజయవాడ లోని కృష్ణలంక వారధిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి.వంతెనపై రెండు లారీలు ఢీకొని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తటంతో వరద ప్రవాహాన్ని చూసేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు.ఒక వైపు భారీగా జనం,మరోవైపు లారీ ఢీకొనగా... వారధిపై వాహనాలు నిలిచిపోయాయని పోలీసులు చెబుతున్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8 దాటినా పరిస్థితి మారలేదు. వాహన చోదకులు ట్రాఫిక్ జామ్ కారణంగా నరకం చూశారు.