ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్ వెళ్తున్నారా.. ట్రాఫిక్ ఆంక్షలు గమనించారా

Traffic Restrictions in Hyderabad: శాసనసభ సమావేశాల కారణంగా హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 3 నుంచి ఆదివారాలు మినహా సమావేశాలు ముగిసే వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తామని తెలిపారు. ఇందుకు ప్రజలు, ప్రయాణికులు సహకరించాలని వారు కోరారు.

హైదరాబాద్​లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్​లో ట్రాఫిక్ ఆంక్షలు

By

Published : Feb 2, 2023, 2:11 PM IST

Traffic Restrictions in Hyderabad: హైదరాబాద్​లో శాసనసభ సమావేశాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 3 నుంచి ఆదివారాలు మినహా సమావేశాలు ముగిసే వరకూ.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తామని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ జి.సుధీర్‌బాబు బుధవారం తెలిపారు. ఆయా సమయాల్లో వాహనాల నిలుపుదలతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఆంక్షలు అమలులో ఉండే మార్గాలు..తెలుగుతల్లి- ఇక్బాల్‌ మినార్‌ - రవీంద్రభారతి- వి.వి.విగ్రహం- షాదన్‌కళాశాల- నిరంకారి- సైఫాబాద్‌ పాతపోలీస్‌స్టేషన్‌- మాసబ్‌ట్యాంక్‌- పీటీఐ బిల్డింగ్‌-అయోధ్య, నిరంకారి-న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌- బషీర్‌బాగ్‌ జంక్షన్‌ టు ఓల్డ్‌ పీసీఆర్‌ జంక్షన్‌, బీజేఆర్‌ విగ్రహం- ఏఆర్‌ పెట్రోల్‌పంప్‌- నాంపల్లి రైల్వేస్టేషన్‌- ఎంజేమార్కెట్‌- తాజ్‌ ఐలాండ్‌- బీఆర్‌కే భవన్‌- ఆదర్శ్‌నగర్‌- ఓల్డ్‌ పీసీఆర్‌ జంక్షన్‌- మినిస్టర్స్‌ రెసిడెన్సీ కాంప్లెక్స్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 12- విరంచి హాస్పిటల్‌- మాసబ్‌ట్యాంక్‌ ః జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు-కేబీఆర్‌పార్క్‌-ఎల్వీప్రసాద్‌ ఐ హాస్పిటల్‌- శ్రీనగర్‌ కాలనీ జంక్షన్‌- నిమ్స్‌ - వి.వి.విగ్రహం ః ఈఎస్‌ఐ ఆసుపత్రి- ఎస్‌.ఆర్‌.నగర్‌ మెట్రోస్టేషన్‌-అమీర్‌పేట్‌ స్టేషన్‌- పంజాగుట్ట జంక్షన్‌- నిమ్స్‌- వి.వి.విగ్రహం ః సీటీవో జంక్షన్‌- ప్యారడైజ్‌- రాణిగంజ్‌- కర్బలా- చిల్డ్రన్‌పార్క్‌- ట్యాంక్‌బండ్‌- అంబేడ్కర్‌ విగ్రహం-తెలుగుతల్లి -ఇక్బాల్‌మినార్‌-రవీంద్రభారతి ః ప్లాజా జంక్షన్‌- ప్యాట్నీ- బాటా- బైబిల్‌హౌస్‌- కర్బలా ప్రాంతాల్లో అమలులో ఉంటాయన్నారు.

రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సర వార్షిక పద్దుకు ఆమోదం కోసం.. శాసనసభ, శాసనమండలి రేపటి నుంచి సమావేశం అవుతున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి రేపు మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. రెండేళ్ల తర్వాత సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.

హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వ, రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదుల మధ్య చర్చల అనంతరం రాజ్యాంగ బద్ధంగా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంతరెడ్డితోపాటు పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డితోపాటు కొందరు అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి బడ్జెట్‌ సమావేశాలపై గవర్నర్‌తో చర్చలు జరిపారు. ఆ తర్వాతనే బడ్జెట్‌ సమావేశాల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details