ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాఫిక్​ స్పెషల్ డ్రైవ్: వాహనం ఒక్కటే.. నెంబర్ ప్లేట్లే అనేకం..! - Traffic Police special Drive latest News

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఫలితంగా వాహనదారులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నకిలీ నెంబర్ ప్లేట్లను వినియోగిస్తున్నారు. మరికొందరు నెంబర్ ప్లేట్లలోని నెంబర్లను సరిగా కనిపించకుండా చేస్తున్నట్లు వాహన తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. తాజాగా ఆరు వాహనాలు నకిలీ నెంబర్ ప్లేట్​తో నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. భారీ జరిమానా విధించారు .

ట్రాఫిక్​ స్పెషల్ డ్రైవ్ : వాహనం ఒక్కటే.. నెంబర్ ప్లేట్లే అనేకం..!
ట్రాఫిక్​ స్పెషల్ డ్రైవ్ : వాహనం ఒక్కటే.. నెంబర్ ప్లేట్లే అనేకం..!

By

Published : Nov 15, 2020, 7:23 PM IST

Updated : Nov 15, 2020, 11:12 PM IST

నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నా.. తప్పించుకునేేందుకు వాహనదారులు నూతన పంథాలు వెతుకుతున్నారు.

ఏకంగా నెంబర్ పేట్లే మారుస్తున్నారు..

కొందరు నెంబర్ ప్లేట్లలో కొన్ని నెంబర్లను చెరిపేస్తుంటే.. మరికొందరు ఏకంగా నెంబర్ ప్లేటే మార్చి వాహనాన్ని నడుపుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి నిబంధనలు పాటించని వారిపై కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో జరిమానాలు సైతం విధిస్తున్నారు.

ఒకే వాహనం 9 చలానాలు..

తనిఖీల్లో భాగంగా ఓ ద్విచక్ర వాహనానికి తొమ్మిది చలానాలు వచ్చాయి. తాను ఏ తప్పు చేయకుండా తమ పేరు మీద 6 ట్రాఫిక్ చలానాలు ఎలా వచ్చాయని ఆరా తీసి.. అసలు సంగతిని తెలుసుకున్నారు. చలానాలో ట్రాక్టర్ పేరు ఉండటంతో షాక్ తిన్న ద్విచక్ర వాహనదారుడు పోలీసులకు సమాచారం అందించాడు.

ఆ వాహనం స్వాధీనం..

ఫిర్యాదును స్వీకరించిన ట్రాఫిక్ పోలీసులు నకిలీ నెంబర్ ప్లేట్​తో తిరుగుతున్న వాహనాన్ని గుర్తించారు. అనంతరం వాహనాన్ని స్వాధీనం చేసుకుని రవాణాశాఖ అధికారులకు అందజేయగాా వారు భారీ జరిమానా విధించారు.

కఠిన చర్యలు తీసుకుంటాం..

నగరంలో కొంతమంది అక్రమార్కులు తమ వాహనాల నెంబర్లు మార్చి నడుపుతున్న ఆరు వాహనాలను గుర్తించినట్లు విజయవాడ ఏడీసీపీ సర్కార్ పేర్కొన్నారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నకిలీ నెంబర్ ప్లేట్ వినియోగిస్తున్నారని గుర్తించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చూడండి : హార్డ్ వేర్ షాపులో అగ్నిప్రమాదం..ఎగసిపడిన మంటలు

Last Updated : Nov 15, 2020, 11:12 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details