ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలువలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన ట్రాఫిక్​ పోలీసులు - traffic police saved women news

కాలువలో ప్రమాదవశాత్తు ఓ మహిళ మునిగిపోయింది. గమనించిన ట్రాఫిక్​ సిబ్బంది ఆమెను కాపాడారు. ఈ ఘటన విజయవాడ కృష్ణలంక పూల మార్కెట్ సమీపంలో జరిగింది.

police saved a women
మహిళను కాపాడిన ట్రాఫిక్​ పోలీసులు

By

Published : Oct 30, 2020, 4:55 PM IST

విజయవాడలోని కృష్ణలంక పూల సంత సమీపంలో ఓ మహిళ కాలువలో మునిగిపోయింది. స్నానానికి దిగిన క్రమంలో ప్రమాదం జరిగింది. నీటిలో కొట్టుకుపోతున్న మహిళను గమనించిన ట్రాఫిక్​ సిబ్బంది ఆమెను కాపాడారు. మహిళను విజయనగరానికి చెందిన పెనుమత్స బంగారు(55)గా గుర్తించారు. మహిళ స్వల్ప అస్వస్థతకు గురి కావటంతో ప్రథమ చికిత్స అనంతరం ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details