విజయవాడ నగర పరిధిలోని సింగ్ నగర్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. దాతృత్వాన్ని చాటారు. వాంబే కాలనీలోని అమ్మ ఆదరణ వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులకు అండగా నిలిచారు.
తమ సొంత ఖర్చులతో నెల రోజులకు సరిపడా సరకులను అందించారు. గృహ నిర్బంధంలోని పేద కుటుంబాలకు నెలకు సరిపడా వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.