పట్టణంలో వాహనాల సమస్యపై సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పర్యవేక్షణలో... ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఎస్సై సాగర్‌బాబు తెలిపారు. ప్రధానంగా పట్టణ పరిధిలో దుకాణాల ఎదుట వాహనాలను పార్కింగ్ చేస్తే యజమానులే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడినప్పుడు ఆయా దుకాణాల యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం వ్యాపార సంస్థల యజమానులు సహకరించాలని కోరారు.
నూజివీడు పట్టణంలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు..! - నూజివీడు తాజా వార్తలు
కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో... నూతన ట్రాఫిక్ నిబంధనలు తీసుకొచ్చామని... ఎస్సై సాగర్‌బాబు తెలిపారు.
నూజివీడు పట్టణంలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు