ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్నవరంలో రెచ్చిపోతున్న ఆకతాయిలు.. రోడ్లపై వీరంగం - about Yuvakulu Hulchal gannavaram

Yuvakulu Hulchal: కృష్ణా జిల్లా గన్నవరంలో ఆకతాయిల హల్​చల్ చేశారు. ద్విచక్ర వాహనాలతో చెన్నై-కోల్​కతా జాతీయ రహదారితోపాటు.. పట్టణ వీధుల్లో వీరంగం సృష్టించారు. నడిరోడ్డుపై పరస్పర దాడులకు దిగి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసుల పర్యవేక్షణ లేకపోవటంతో ఆకతాయిలు వీరంగం సృష్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు గన్నవరం అడ్డాగా మారిందని విమర్శిస్తున్నారు.

గన్నవరంలో ఆకతాయిల హల్చల్
Yuvakulu Hulchal

By

Published : Nov 13, 2022, 8:27 PM IST

Traffic jam is caused by the young people: వారంతా ఆకతాయిలు.. చేతిలో బైకులున్నాయి.. ఆకాశమే హద్దుగా ద్విచక్ర వాహనాలను నడుపుతూ పాదచారులకు, రహదారిపై ప్రయాణికులకు ఇబ్బందులు కలిగేలా చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఆకతాయిలు.. ద్విచక్ర వాహనాలతో చెన్నై-కోల్​కతా జాతీయ రహదారి, వీధుల్లో వీరంగం సృష్టించారు. దావాజీగూడెం హైస్కూల్ వద్ద మాటామాటా పెరిగి వివాదం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై పరస్పరం దాడులకు దిగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసుల పర్యవేక్షణ కొరవడటంతోనే యువకులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపించారు. బీబీగూడెం, సూరంపల్లిలో యథేచ్ఛగా పేకాట, కోడిపందేలు నిర్వహిస్తున్నారని, గత కొంత కాలంగా అసాంఘిక కార్యకలాపాలకు గన్నవరం అడ్డాగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు.

కృష్ణా జిల్లా గన్నవరంలో ఆకతాయిల హల్చల్

ABOUT THE AUTHOR

...view details