ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర సరిహద్దు చెక్​పోస్టుల వద్ద ట్రాఫిక్ జామ్ - ఏపీలో చెక్​పోస్టుల వద్ద ట్రాఫిక్ జామ్

సోమవారం నుంచి రాష్ట్ర సరిహద్దు చెక్​పోస్టులు ఎత్తివేస్తారన్న వదంతులతో సరిహద్దు వద్ద భారీగా వాహనాలు దర్శనమిచ్చాయి. తెలంగాణ నుంచి వచ్చే వాహనాలు చెక్​పోస్టుల వద్ద బారులు తీరాయి. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

traffic jam
traffic jam

By

Published : Jun 8, 2020, 3:47 PM IST

కృష్ణా జిల్లా జాతీయ రహదారిపై జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్దనున్న రాష్ట్ర సరిహద్దు.. ఉదయం నుంచీ వాహనాలతో కిటకిట లాడింది. సోమవారం నుంచి ఏపీలో సరిహద్దు చెక్ పోస్ట్ ఎత్తివేస్తారని వదంతులు రావడంతో రోజు కంటే మూడు రెట్లు అధికంగా వాహనాలు తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి బారులు తీరాయి.

చెక్ పోస్ట్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు ఇబ్బందిగా మారింది. మధ్యాహ్నం తర్వాత నుంచి వాహనాల సంఖ్య తగ్గడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ-పాస్ లేకుండా వచ్చిన వాహనాలను వెనక్కి పంపడం, ఉన్నవారికి రద్దీ వల్ల ఆలస్యం కావడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details