ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్ జోన్ అని తెలియక వచ్చారు.. ఇరుక్కుపోయారు! - జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వార్తలు

ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలోని జొన్నలగడ్డ చెక్​పోస్ట్ వద్ద భారీగా వాహనాల రాకతో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మధిరను రెడ్ జోన్​గా ప్రకటించింది. అది తెలియక వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

boarder boarder rush
boarder rush

By

Published : Jun 13, 2021, 10:13 PM IST

ఆంధ్ర-తెలంగాణ సరిహద్దైన కృష్ణా జిల్లా జొన్నలగడ్డ చెక్​పోస్ట్ వద్ద వందలకొద్ది వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మధిరను రెడ్​జోన్​గా ప్రకటించింది. అధికారులు అక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. వాహనాల రాకపోకలను నిషేధించారు. అది తెలియక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సరైన సమాచారం లేక వచ్చామని.. వెళ్లడానికి అనుమతివ్వాలని పోలీసులను వేడుకున్నారు. వారు అనుమతించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.

ఇదీ చదవండి:ASHOK BABU: '5' పీఆర్సీలు పెండింగ్​లో పెడితే ఎలా..? సీఎం సార్​

ABOUT THE AUTHOR

...view details