ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణాజిల్లాలో కదం తొక్కిన రైతన్న.. ట్రాక్టర్లు, బైకులతో భారీ ర్యాలీ - new farm laws

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ.. కృష్ణాజిల్లాలో రైతులు ట్రాక్టర్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. దిల్లీలో రైతు సంఘాల నాయకులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా.. ర్యాలీలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విషయంలో కేంద్రం స్పందించకుంటే దేశవ్యాప్తంగా రైతులు తమ సత్తా చాటేందుకు సిద్ధంగా రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు.

tractor rally in machilipatnam
ట్రాక్టర్లు, బైకుల ర్యాలీ భారీ ర్యాలీ

By

Published : Jan 25, 2021, 4:39 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ట్రాక్టర్లు, బైక్​లతో ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విషయంలో కేంద్రం స్పందించకుంటే దేశవ్యాప్తంగా రైతులు తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు హెచ్చరించారు.

ట్రాక్టర్లు, బైకుల ర్యాలీ భారీ ర్యాలీ

మచిలీపట్నం మూడు స్థంభాల సెంటర్ నుంచి కోనేరు సెంటరు, బస్టాండు, లక్ష్మీటాకీస్ సెంటర్ మీదుగా సాగిన ర్యాలీలో పాల్గొన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ అనుబంధ సంఘ నాయకులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి జమలయ్య రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'గణతంత్ర పరేడ్'​కు రైతుల రూట్​ మ్యాప్​

ABOUT THE AUTHOR

...view details