మున్నేరు వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా..ఇద్దరు మృతి
తిరుపతమ్మ దర్శనానికి తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారిని ప్రమాదం వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న వాహనం వంతెనపై నుంచి పడి ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రగాయాల పాలయ్యారు.
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు వద్ద మున్నేరు వంతెనపై ప్రమాదం చోటు చేసుకుంది. వంతెనపై నుంచి ట్రాక్టర్ కింద పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొంతమందికి గాయాలయ్యాయి. బాధితులు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రెడ్డిగూడెం గ్రామస్థులు. వీరు పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకటనారాయణతో పాటు మరొకరు మృతి చెందినట్లు సమాచారం. మరో 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారందరిని చికిత్స కోసం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు