కృష్ణా జిల్లా నూజివీడులో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను.. వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో.. ట్రాక్టర్ డ్రైవర్, ముసునూరు మండలం కొర్లగుంట గ్రామానికి చెందిన పిన్నిబోయిన రమేష్.. అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో ఉన్న మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. గడ్డి తీసుకురావడం కోసం బయల్దేరిన ఈ ముగ్గురు.. నూజివీడు పట్టణ పరిధిలోని బైపాస్ దగ్గర ట్రాక్టర్‌తో ఆగారు. అదే సమయంలో కంచికచర్లకు చెందిన ధాన్యం లారీ వేగంగా వచ్చి వారిని ఢీ కొట్టింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీ డ్రైవర్ అతి వేగం.. ట్రాక్టర్ డ్రైవర్ బలి - కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం వార్తలు
లారీ డ్రైవర్ అతివేగం.. ట్రాక్టర్ డ్రైవర్ ప్రాణాన్ని బలి తీసుకుంది. మరో ముగ్గురిని గాయాలపాలు చేసింది. కృష్ణా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
tractor driver died in road accident at Nuzvidu in krishna districtc