- పాలిసెట్ ప్రవేశ పరీక్షలో మార్పులేంటో తెలుసా..!
పాలిసెట్ ప్రవేశ పరీక్షలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భౌతిక శాస్త్రంలో ప్రశ్నలను పెంచి.. గణితంలో కుదించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దిల్లీలో పోలవరం నిర్వాసితుల ఆందోళన..లైవ్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- పాపం పాస్టర్‌ది.. ఫలితం అమాయక బాలికది..!
మంచి, చెడులను బోధిస్తూ జ్ఞాన మార్గం వైపు నడిపించాల్సిన పాస్టరే.. కామాంధుడిగా మారాడు. భక్తితో దేవుని సన్నిధికి వస్తున్న 14 ఏళ్ల బాలికను మాయమాటలతో లొంగదీసుకున్నాడు. పలుమార్లు అత్యాచారం చేసి.. గర్భవతిని చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం.. రక్షించిన కానిస్టేబుల్
కుటుంబ కలహాల కారణంగా మనస్థాపంతో జలాశయంలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. వెంటనే స్పందించిన ఓ కానిస్టేబుల్ ఆమెను రక్షించాడు. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వీడని ప్రతిష్టంభన- అయినా ఐదు బిల్లులకు ఆమోదం!
గందరగోళ పరిస్థితుల మధ్యే పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు కొనసాగాయి. విపక్షాల ఆందోళన నడుమ మూడు బిల్లులు రాజ్యసభ, రెండు బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దీదీకి మోదీ ఫోన్- ఆదుకుంటామని హామీ
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి వరద నష్టంపై వివరాలు కనుక్కున్నారు. విపత్తు నుంచి బయటపడేందుకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా దెబ్బకు ఆ నగరం బంద్- అధికారులకు శిక్షలు!
చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారిన ఝాంగ్జియాజీ నగరాన్ని పూర్తిగా మూసేసింది. వైరస్ కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక అధికారులకు శిక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాత నోట్లు, నాణేలు పేరుతో మోసాలు- ఆర్బీఐ వార్నింగ్
తమ పేరు, లోగోను అక్రమంగా వాడుకుని మోసాలు జరుగుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రజల నుంచి ఆర్బీఐ నేరుగా ఎలాంచి ఛార్జీలు, ట్యాక్స్‌లు వసూలు చేయదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రెజ్లింగ్‌లో ఫైనల్‌కు రవి దహియా
టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా.. దేశానికి కనీసం మరో రజతాన్ని ఖాయం చేశాడు. ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 57 కిలోల విభాగం సెమీస్‌లో కజకిస్థాన్ రెజ్లర్ సనయేవ్ నురిస్లామ్‌పై నెగ్గి ఫైనల్‌లో ప్రవేశించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఒకే రోజు 16 పాటలు.. అమ్మ మందలించింది: సింగర్ చిత్ర
20వేలకు పైగా పాటలతో సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసింది కె.ఎస్.చిత్ర. దక్షిణ భారతంలో ఆమె ఓ స్వర శిఖరం. ఇటీవలే 'ఈటీవీ'లో 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన ఆమె.. తన సంగీత ప్రయాణంలో జరిగిన కొన్ని విశేషాలను పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 5 PM
Last Updated : Aug 4, 2021, 6:39 PM IST