ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధాన వార్తలు @ 7 PM - 7PM TOP NEWS

.

ప్రధాన వార్తలు @ 7 PM
ప్రధాన వార్తలు @ 7 PM

By

Published : Nov 10, 2020, 6:59 PM IST

  • జర్నలిస్ట్ నుంచి ప్లీడర్ దాకా.. కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు రఘునందనమే
    భాజపాలో కీలక నేత.. క్యాడర్​కు సదా అందుబాటులో ఉంటాడనే పేరు.. వెరసి రెండుసార్లు ఓటమి పాలైనా పోరాటం ఆపలేదు. ముచ్చటగా మూడోసారి బరిలో నిలిచి దుబ్బాక పీఠం కైవసం చేసుకున్నారు మాధవనేని రఘునందన్ రావు. ఐపీఎల్ మ్యాచ్​ తరహాలో ఉత్కంఠగా సాగిన ఓటింగ్​లో అధికార పార్టీపై స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. తెరాస జోరు, కాంగ్రెస్ నుంచి పోటీని దీటుగా ఎదుర్కొని విజయదుందుభి మోగించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • బిహార్​లో ఎన్​డీఏ హవా- విజయంపై ఆర్​జేడీ ధీమా
    కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని కౌంటింగ్​ కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసినట్టు ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఫలితాల ప్రకటనలో తొందరేమీ లేదని.. ప్రశాంతంగా పని చేయాలని ఎన్నికల సిబ్బందికి సూచించినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • బిహార్​లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ సీఎం నితీశేనా?
    బిహార్​లో ఎన్డీఏ నాయకత్వంపై ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్​. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ముందంజలో ఉన్న క్రమంలో.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నితీశ్​ కుమార్​ మళ్లీ నేతృత్వం వహిస్తారా? అన్న ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • గట్టెక్కిన శివరాజ్​ సర్కార్​- 'సింధియా'కు నయా జోష్
    మధ్యప్రదేశ్​ ఉపఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించింది. 28స్థానాలకు పోలింగ్​ జరగ్గా.. మూడింట రెండొంతులకుపైగా సీట్లను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని గట్టెక్కించుకుంది. ముఖ్యంగా జోతిరాదిత్య సింధియా వర్గంలోని చాలామంది ఈ ఎన్నికల్లో విజయం దక్కింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • ప్రియురాలి శరీరాన్ని కట్టర్​తో కట్ చేసి.. గోనెసంచిలో కుక్కి..!
    రెండున్నర ఏళ్ల కిందట బీటెక్ విద్యార్థిని నజీమా అదృశ్యమైంది. అప్పటినుంచి కేసును ఛేదించే పనిలో పడ్డ పోలీసులు.. తాజాగా చిక్కుముడిని విప్పారు. అయితే ఆ విద్యార్థిని అదృశ్యానికి కారణాలు, చంపేసిన విధానాన్ని తెలుసుకుని పోలీసులే షాకయ్యారు. ప్రేమించిన వ్యక్తే.. ఆ యువతిపాలిట యముడిగా మారాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • 'దోహా' ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం: తాలిబన్లు
    అఫ్గానిస్థాన్​లో శాంతిస్థాపనకు కట్టుబడి ఉన్నామని అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్​కు స్పష్టం చేశారు తాలిబన్లు. దశాబ్దాల సంఘర్షణకు తెర దించేందుకు ఇదో బృహత్తర ఒప్పందం అని కొనియాడారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • పరిపాలన సన్నద్ధతలో బైడెన్​- న్యాయపోరాటంలో ట్రంప్​ !
    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్​ విజయం సాధించారు. అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు​. మరోవైపు.. తన ఓటమిని అంగకరించేందుకు నిరాకరిస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్​. కచ్చితమైన, నిజాయతీగల ఓట్ల లెక్కింపునకు అన్ని అవకాశాలను అన్వేషిస్తామని స్పష్టం చేశారు ట్రంప్​. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
    బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్​ పడింది. మంగళవారం 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.660కిపైగా దిగొచ్చింది. వెండి ధర కిలోకు ఏకంగా రూ.1400లకుపైగా తగ్గి.. రూ.63వేల దిగువకు చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • 'కోహ్లీ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది'
    ఆసీస్​ పర్యటనలో టెస్టు సిరీస్​ నుంచి కోహ్లీ తప్పుకోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ స్టీవ్ వా స్పందించారు. అతడి నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • హీరో వరుణ్‌ సందేశ్‌ ఇంట విషాదం
    ప్రముఖ రచయిత, హీరో వరుణ్ సందేశ్ తాతయ్య జీడిగుంట రామచంద్రమూర్తి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరోనా మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతూ మృతిచెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details