.
నల్లబజారుకు కందిపప్పు..! - millets
ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా పేద ప్రజలకు కందిపప్పు అందిస్తున్నా అది సక్రమంగా వారికి చేరడం లేదు. ప్రతినెలా అందాల్సిన పప్పు నల్లబజారుకు తరలుతోంది. క్షేత్రస్థాయిలో కంది పప్పు పంపిణీపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో చౌక డిపో దారులు కందిపప్పును నల్లబజారుకు యథేచ్చగా తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో గుట్టల కొద్దీ కత్తిరించిన కందిపప్పు కవర్లను అక్రమార్కులు రోడ్డు పక్కనే పడేశారు. పేదలకు చేరాల్సిన సరకులు బయట మార్కెట్లో దర్శనమిస్తున్న కారణంగా..అధికారులు తనిఖీలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేద ప్రజలు కోరుతున్నారు.
నల్లబజారుకు కందిపప్పు